Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

1.25 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం పట్టేసిన టెక్కీ

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ఒకరు రికార్డు స్థాయి వేతనంతో ఉద్యోగం సంపాదించడం టాక్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అయింది. ఢిల్లీలో ప్లానింగ్‌ కన్సల్టెంట్‌, ఫ్రీ లాన్స్‌ ట్రాన్స్‌ లేటర్‌ (తల్లి) దంపతుల కుమారుడైన సిద్ధార్థ్ ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీలో విద్యనభ్యసించాడు. ఉబెర్ టెక్నాలజీస్ లో వారం రోజులు ఇంటర్న్ షిప్ చేసిన సిద్ధార్థ్... అదే సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇంటర్వ్యూలో కష్టసాధ్యమైన ప్రశ్నలకు సమాధానమిచ్చి బోర్డును మెప్పించాడు. దీంతో 1.25 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం చేసేందుకు శాన్ ఫ్రాన్సిస్కో రావాలంటూ సిద్ధార్థ్ కు ఉబెర్ టెక్నాలజీస్ ఆహ్వానం పంపింది. కాగా, 2015లో 1.27 కోట్ల రూపాయల వేతనంతో ఇదే యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థికి ఉద్యోగావకాశం లభించిన సంగతి తెలిసిందే. 

More Telugu News