లవర్స్ కోసం విస్తారా ఎయిర్‌ లైన్స్‌ 'ప్రేమికుల రోజు' బంపరాఫర్

14-02-2017 Tue 09:33 | National
దేశవాళీ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్‌ లైన్స్‌ ఈ వాలంటైన్స్ డే సందర్భంగా  ప్రేమికులకు బంపరాఫర్‌ ను ప్రకటించింది. ఐదు రోజుల పాటు ప్రత్యేక తగ్గింపు ధరలను అందిస్తున్నట్టు తెలిపింది. 17వ తేదీ అర్థరాత్రి వరకూ అందుబాటులో ఉండేలా రూ. 899 నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయని, ఎకానమీ విభాగంలో ఓ వైపు ప్రయాణానికి ఈ ధర వర్తిస్తుందని తెలిపింది. ఫిబ్రవరి 28 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ప్రయాణ తేదీని ఎంచుకోవాల్సి వుంటుందని తెలిపింది. ఈ ఆఫర్లలో భాగంగా బిజినెస్ క్లాస్ లో 60శాతం డిస్కౌంట్‌ ను, ప్రీమియం ఎకానమీ విభాగంలో 40శాతం వరకు రాయితీని అందిస్తామని పేర్కొంది. ఇండియాలో తమ సర్వీసులు నడుస్తున్న 20 నగరాలు, పట్టణాలకు ప్రయాణించవచ్చని, ఇటీవల తమ సర్వీసులు ప్రారంభమైన పోర్ట్ బ్లెయిర్, అమృత్‌సర్,  లేహ్ సర్వీసులకూ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more