జర్నలిస్టుపై దాడితో నాకు సంబంధం లేదు.. నేను ఎవరిపైనా దాడులు చేయించను!: ఎమ్మెల్యే ఆమంచి

06-02-2017 Mon 18:00 | Both States
ఫ్రీ లాన్స్ జర్నలిస్టు నాయుడు నాగార్జున రెడ్డిపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, వ్యక్తిగత దాడులకు తాను ఎవ్వరినీ ప్రోత్సహించలేదని ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు. ఈయన అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక పత్రికలో ఇటీవల ఓ కథనం వెలువడింది. ఈ కథనాన్ని వేటపాలెంకు చెందిన నాయుడు నాగార్జున రెడ్డి అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు రాశాడు. ఈ కథనంపై ఆగ్రహించిన కొందరు వ్యక్తులు రెండు రోజుల క్రితం చీరాల పోలీస్ స్టేషన్ ఎదుట నాగార్జున రెడ్డిపై దాడికి పాల్పడ్డటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ సంఘటనకు కారణం ఎమ్మెల్యే వర్గీయులేనని బాధితుడు ఆరోపించిన నేపథ్యంలో కృష్ణ మోహన్ స్పందించారు. ‘నాగార్జున రెడ్డి అనే ఒక బ్రోకర్, గతంలో నక్సల్స్ కు సానుభూతి పరుడిగా పని చేశాడు. ఆ సమయంలో రూ.50 వేలు దొంగతనం చేయడంతో అతన్ని నక్సల్స్ బహిష్కరించారు. నాగార్జున రెడ్డి ప్రాణభయంతో ఉంటే.. అతని తండ్రి చంద్రా రెడ్డి నా దగ్గరకు వచ్చి వేడుకుంటే, ఆ రోజు రాత్రికి రాత్రే హోం మంత్రి వద్ద అతన్ని సరెండర్ చేశాను. ఈ విషయం మా ప్రాంతంలో అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ లేదా నాగార్జునరెడ్డి లాంటి బ్రోకర్లు చేస్తున్న న్యూసెన్సే ఈ సంఘటన. చీరాలలో అరాచకాలు జరగడం లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా అంత నేనుగా ప్రోత్సహించి ఎవరిపైకి దాడి చేయించలేదు..అటువంటి కేసులు కూడా లేవు.’ అని  అన్నారు. ఇదిలా ఉండగా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే వర్గీయులు తనను చంపాలనే ఉద్దేశం తోనే ఈ దాడి చేశారని ఆరోపించడం గమనార్హం.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more