సీఎంపై శంకర్రావు విసుర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎంపై శంకర్రావు విసుర్లు

తనను, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవమానించడంతో పార్టీకి దళితులు దూరమవుతున్నారని మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు ఆరోపించారు. సీఎంను దళిత ద్రోహి, రాబందు అని పేర్కొన్నారు. ఆయన నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. దళితులను కాంగ్రెస్ కు దూరం చేసే కుట్ర జరుగుతోందని అన్నారు.

ఇక ఒవైసీ సోదరులను ఇబ్బందుల పాల్జేయడంతో మైనార్టీలు సైతం కాంగ్రెస్ కు దూరమవుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తనపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News