ఆ బాల్ గర్ల్ ను నేనే.. నాడు నన్ను ఓదార్చినందుకు ధన్యావాదాలు: టెన్నిస్ ప్లేయర్ సోంగాకు లేఖ

23-01-2017 Mon 17:26 | Sports
ఫ్రెంచ్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ జో విల్ ఫ్రిడ్ సోంగా తనకు చేసిన సాయాన్ని మరవలేనని ఆస్ట్రేలియా బాల్ గర్ల్ జులియానా అంటోంది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఒక సంఘటన కారణంగానే సోంగాకు ఆమె తన కృతజ్ఞతలు చెప్పింది. ఆ సంఘటన వివరాలలోకి వెళితే.. ఆట సీరియస్ గా జరుగుతున్న సమయంలో బాల్ గర్ల్ జులియానాకు టెన్నిస్ బాల్ తగలడంతో ఏడ్చింది. ఈ విషయం గమనించిన సోంగా, ఆమె దగ్గరకు వెళ్లాడు. దీంతో,  సోంగా భుజంపై తన తల ఉంచిన జులియానా వెక్కి వెక్కి ఏడవడంతో, వెంటనే, టెన్నిస్ కోర్టు నుంచి బయటకు తీసుకువెళ్లాడు. ఆమెకు విశ్రాంతి నిచ్చి, పంపించి వేయాలని నిర్వాహకులకు సోంగా చెప్పాడు. అనంతరం, సోంగా తన ఆట కొనసాగించాడు.

ఈ విషయాన్ని గుర్తుంచుకున్న జులియానా సోంగాకు కృతజ్ఞతలు చెబుతూ, లేఖ రాసింది. ఫ్రెంచ్ భాషలో ‘మెర్సీ’ (ధన్యవాదాలు) అని చక్కగా డిజైన్ చేసి రాసిన ఈ లేఖలో ఆమె ఏం పేర్కొందంటే.. ‘మీరు రెండో మ్యాచ్ రెండో రౌండ్లో ఉండగా కోర్టు బయటికి వచ్చి నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. నేను మీకు ఙ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ, ఆరోజు మీరు కోర్టు బయటకు తీసుకువెళ్లిన బాల్ గర్ల్ ని నేనే. నాపై మీరు చూపించిన దయకు ధన్యావాదాలు. నాకు కొంత సాయం అవసరమని గుర్తించిన మీరు, నన్ను స్వయంగా కోర్టు వెలుపలికి సాగనంపినందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆ రోజున నేను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. అందుకే, బాల్ ఇవ్వమని అడిగినా వెంటనే నేను అందించలేకపోయాను. అందుకు క్షమాపణలు’ అని ఆ లేఖలో జులియాని పేర్కొంది. కాగా, ఈ లేఖకు స్పందించిన సోంగా, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ‘నువ్వు రాసిన లేఖకు నా కృతజ్ఞతలు జులియానా!’ అని పేర్కొంటూ, వాళ్లిద్దరూ కలిసి ఉన్న నాటి ఫొటోతో పాటు ఆమె రాసిన లేఖను పోస్ట్ చేశాడు. 

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more