తిరుపతిలో పది రూపాయల నాణేలు చెల్లవట.. అవస్థలు పడుతున్న ప్రజలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతిలో పది రూపాయల నాణేలు చెల్లవట.. అవస్థలు పడుతున్న ప్రజలు

పెద్దనోట్ల రద్దు ప్రభావంతో సుమారు 50 రోజుల‌వ‌ర‌కు ప్ర‌జ‌లు ఐదు, పది రూపాయల నాణేలను భారీగా వినియోగించిన విష‌యం తెలిసిందే. బ్యాంకుల్లో ఖాతాదారుల‌కు కూడా పెద్ద మొత్తంలో ప‌దిరూపాయ‌ల నాణేలు ఇచ్చారు. దీంతో వారి వ‌ద్ద ఇప్పుడు భారీగానే పది రూపాయ‌ల నాణేలు ఉన్నాయి. కానీ, తిరుప‌తిలో మాత్రం ఆ నాణేల‌ను తీసుకోవ‌డానికి వ్యాపారులు ఒప్పుకోవ‌ట్లేద‌ట‌. ఆ నాణేలు ప‌ట్టుకొని ఏమ‌యినా కొనుక్కుందామ‌ని వెళుతున్న ప్ర‌జ‌లు అవి చెల్లుబాటు కావడం లేదని తెలుసుకుంటున్నారు. మ‌రోవైపు నాణేల లెక్కింపు తమకు కష్టంగా ఉంటుందని బ్యాంకు సిబ్బంది సైతం వాటిని తీసుకోవడం లేదు. దీంతో ప్ర‌జ‌లు వాటిని మార్చుకోలేక అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు.
demonitisation

More Telugu News