మూడు దశాబ్దాల క్రితం ఆమెకు వచ్చిన అద్భుత కల ఇప్పుడు నిజమయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడు దశాబ్దాల క్రితం ఆమెకు వచ్చిన అద్భుత కల ఇప్పుడు నిజమయింది!

కెనడా వాసి అయిన‌ ఓ మహిళకు 1989లో లాటరీ గెలిచినట్లు ఓ కల వచ్చింది. అయితే, అప్ప‌ట్లో వ‌చ్చిన ఆ ఖ‌రీదైన‌ క‌ల ఇప్పుడు నిజ‌మ‌యింది. ఇన్నేళ్ల త‌రువాత త‌న క‌ల నిజం కావ‌డంతో ఆ మ‌హిళ ఎంతో మురిసిపోయింది. ఆ దేశానికి చెందిన‌ నోవా స్కొటియాకి చెందిన ఒల్గాకి అప్ప‌ట్లో లాటరీ గెలిచినట్లు కల వచ్చింది. అప్పుడు వ‌చ్చిన‌ ఆ కలలోని లాటరీ టికెట్‌ నంబర్లు కూడా ఆమెకు ఎంతో చ‌క్క‌గా గుర్తున్నాయట‌. అప్ప‌టి నుంచి అలాంటి నంబర్లు ఎక్కువగా ఉన్న లాటరీ టికెట్‌లు కొన‌డం ప్రారంభించింది.

అయినా ఇన్నేళ్లుగా లాట‌రీ త‌గ‌ల‌లేదు. ఆమెకి కొన్ని సంవ‌త్స‌రాల‌ క్రితం కేన్సర్‌ సోకడంతో చికిత్స కోసం తనకున్న ఇంటిని అమ్మేయాల్సి వ‌చ్చింది. కేన్సర్ న‌య‌మ‌యిన‌ప్ప‌టికీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కుంది. అయినప్ప‌టికీ లాటరీలు కొనడం మాత్రం ఆప‌లేదు. తనకి మూడు దశాబ్దాల ‌క్రితం వ‌చ్చిన‌ కలలో లాట‌రీ తగిలిన నంబర్లు క‌లిగిన మ‌రో టికెట్‌ ను ఇటీవల కొనుగోలు చేసింది. ఆ లాటరీలో నిజంగానే ఆమె ఇప్పుడు  5.3 మిలియన్‌ డాలర్లు (రూ. 36కోట్లు) గెలుచుకుంది. దీంతో ఆమె మ‌ళ్లీ త‌న లాట‌రీ డబ్బులతో మంచి ఇల్లు కొనుక్కుంది. తన మనవళ్లు, మనవరాళ్లతో కలిసి డిస్నీ వరల్డ్‌కి వెళ్లి ఎంజాయ్ చేసింది.
dream

More Telugu News