నా కుమార్తెతో డేటింగ్ చేయాలనుకునే కుర్రాడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి!: షారూక్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా కుమార్తెతో డేటింగ్ చేయాలనుకునే కుర్రాడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి!: షారూక్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా, విలక్షణ నటుడు షారూక్ ఖాన్ ‘ఫెమీనా’ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ముఖ్యంగా, తన కూతురు సుహానాతో డేటింగ్ చేసే కుర్రాడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలన్నాడు. అవి ఏమిటంటే.. ‘ఉద్యోగం చేస్తూ ఉండాలి, ‘సుహానా’ నా ఇంటి యువరాణి. అతని సొంతం అనుకుంటే ఊరుకోను. నా కూతురితో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో, అతనితో నా ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది...’ అని షారూక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా, షారూక్ నటించిన ‘రయీస్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.

More Telugu News