సెల్ఫీ మోజులో ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ, కొందరు మాత్రం సెల్ఫీ పిచ్చిని వదిలించుకోవడం లేదు. ప్రమాదకర ప్రదేశాల్లో, క్రూర మృగాలతో సెల్ఫీలకు ప్రయత్నించి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటువంటి ఘటనే థాయ్‌లాండ్ లోని ఖయో యాయ్ జాతీయ పార్కులో మరొకటి చోటుచేసుకుంది. మొసలితో సెల్పీ తీసుకుంటూ మారియల్ బెనెటులియర్(41) అనే ఫ్రెంచ్ మహిళ గాయాలపాలయింది. ఆమె కాలిని మొసలి కొరికేసింది. సదరు మహిళ మొసలికి బాగా దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసిందని, దీంతో అది పట్టుకుని కోరకడంతో ఆమె ఎడమ కాలికి గాయాలయ్యాయని పార్కు సిబ్బంది చెప్పారు. పార్కులో సూచించిన హెచ్చరికల బోర్డులను పట్టించుకోకుండా ఆమె ఈ దుస్సాహసం చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు