గుట్టుచప్పుడు కాకుండా నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్‌హోమ్‌కు వీణా-వాణీల తరలింపు!
వీణా-వాణీలకు ఆపరేషన్ చేసినా ఫలితం తక్కువేనన్న అభిప్రాయంతో సర్కారు వారికి ఆపరేషన్ నిర్వహించడానికి వెనక్కి తగ్గింది. దీంతో నీలోఫర్ నుంచి వారిని స్టేట్ హోమ్‌కు తరలించారు. వారిని ఆసుపత్రి నుంచి తరలిస్తున్న క్రమంలో వీణా-వాణీలు తాము ఆసుపత్రి నుంచి వెళ్లబోమని వ్యాఖ్యానించారు. జీవితకాలం భద్రత కోసం వీణా-వాణీలను తమకు ఆసుపత్రి వర్గాలు అప్పగించాయని స్టేట్ హోమ్ అధికారులు మీడియాకు తెలిపారు.