ఐఐటీ మద్రాస్‌ వెబ్‌సైట్‌ హ్యాక్... పాకిస్థాన్ అనుకూల నినాదాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఐటీ మద్రాస్‌ వెబ్‌సైట్‌ హ్యాక్... పాకిస్థాన్ అనుకూల నినాదాలు

ఐఐటీ మద్రాస్‌ వెబ్‌సైట్ ను ఓపెన్ చేసిన విద్యార్థుల‌కి తాజాగా పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు క‌నిపించాయి. అంతేగాక‌, 'పాకిస్థాన్‌ హ్యాకర్స్‌ శక్తి మీకు తెలియదు' అంటూ హెచ్చ‌రిక‌లు కూడా క‌నిపించాయి. దీంతో ప‌లువురు విద్యార్థులు త‌మ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గుర‌యింద‌ని గ్ర‌హించి ఈ విష‌యాన్ని ఐఐటీ మద్రాస్‌ అధికార ప్రతినిధి వెంకట్రామన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం వెబ్‌సైట్‌ను పున‌రుద్ధ‌రించిన‌ట్లు వెంక‌ట్రామ‌న్ మీడియాకు చెప్పారు.  ఫైజల్‌1337ఎక్స్‌ అనే హ్యాకర్ ఈ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన‌ట్లు భావిస్తున్నారు.
iit madras

More Telugu News