అసెంబ్లీని బ‌హిష్క‌రించిన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం.. కోదండ‌రాం ఇంటికి పయనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసెంబ్లీని బ‌హిష్క‌రించిన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం.. కోదండ‌రాం ఇంటికి పయనం

తెలంగాణ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తోన్న భూసేక‌రణ విధానానికి వ్య‌తిరేకంగా ప్రొ.కోదండ‌రాం చేప‌ట్టిన‌ దీక్ష‌కు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. నిన్న శాస‌న‌స‌భ‌లో భూసేక‌ర‌ణ చ‌ట్టం బిల్లు స‌వ‌ర‌ణ‌ల‌కు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే, స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడిన త‌రువాత త‌మ‌ను మాట్లాడ‌నివ్వ‌లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈ రోజు మండిప‌డ్డారు. త‌మ నిర‌స‌న‌ను లేఖ రూపంలో స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారికి అంద‌జేసి వారంతా అసెంబ్లీని బ‌హిష్క‌రించారు. కాగా, ప్ర‌తిప‌క్ష నేతలు ప్రొ.కోదండ‌రాం ఇంటికి బ‌య‌లుదేరుతున్న‌ట్లు తెలుస్తోంది.
kodandaram
assembly

More Telugu News