అది పాక్‌ క్రికెట్‌ జెర్సీ.. దాని వెనుక ‘ధోనీ’ పేరు.. స్టేడియంలో అందరి దృష్టిని ఆక‌ర్షించిన అభిమాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అది పాక్‌ క్రికెట్‌ జెర్సీ.. దాని వెనుక ‘ధోనీ’ పేరు.. స్టేడియంలో అందరి దృష్టిని ఆక‌ర్షించిన అభిమాని!

పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉంది. అందులో భాగంగా మెల్‌బోర్న్ వేదిక‌గా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెల‌వ‌డానికి పాకిస్థాన్ క‌ష్ట‌ప‌డుతోంది. అయితే, ఇదే మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ అభిమాని పాకిస్థాన్‌ క్రికెట్‌ జెర్సీని ధరించి స్టేడియంలో అటూ ఇటూ తిరుగుతూ క‌నిపించాడు. అయితే, అతని జెర్సీ వెనకవైపు ధోని జెర్సీ నెంబరు 7 తో పాటు  ‘ధోని’ అని రాసి ఉంది. పాకిస్థాన్ జెర్సీపై ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ ధోనీ పేరు ఉండడం.. దానిని అతడు ధ‌రించ‌డంతో అంద‌రి క‌ళ్లు అత‌డిపైనే ప‌డ్డాయి. అతనితో పాటు చాలా మంది కూడా అలాంటి జెర్సీనే ధరించిన‌ట్లు తెలుస్తోంది. భారత్‌, పాక్‌ల మ‌ధ్య క్రికెట్ మ్యాచ్‌లు జ‌ర‌గాల‌ని ఆ అభిమాని కోరుకుంటున్న‌ట్లు అంద‌రూ భావిస్తున్నారు.


pak

More Telugu News