షూను వాసన చూసిన తర్వాత అక్షయ్ కుమార్ పరిస్థితి ఇదీ !
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షూను వాసన చూసిన తర్వాత అక్షయ్ కుమార్ పరిస్థితి ఇదీ !

'మనం ధరించే షూ వాసన రాకుండా ఉండాలంటే ఫలానా చిట్కా పాటించండి' అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు ఎవరో ఒక సలహా ఇచ్చారట. ఆ సలహాను పాటించిన అక్షయ్ కుమార్, తన షూ వాసన వస్తోందో లేదో చూసిన వెంటనే ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ‘షూ లో ఒక చిన్న టీ బ్యాగ్ పెట్టుకుంటే, దుర్వాసన రాకుండా ఉంటుందని ఒకరు నాకు చెప్పారు. అలాగే చేసిన నేను, ఆ తర్వాత షూ ను వాసన చూసిన నా పరిస్థితి ఇదీ!’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో వైరల్ గా మారింది.

 

More Telugu News