అనారోగ్యంతో బాధ పడుతున్న మహిళకు ఆర్థిక సహాయం చేసిన సినీ నటుడు సంపూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనారోగ్యంతో బాధ పడుతున్న మహిళకు ఆర్థిక సహాయం చేసిన సినీ నటుడు సంపూ

సినీ నటుడు సంపూర్ణేష్ బాబు తోటి వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అగ్రహీరోల మాదిరి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోకపోయినప్పటికీ... తనకు ఉన్న దాంట్లో పక్కనున్న వారికి సహాయం చేస్తుంటాడు. తాజాగా మరోసారి ఆయన తన పెద్ద మనసును చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లాలోని గాడిచెర్లపల్లిలో వినోద అనే మహిళ ఓ వింత వ్యాధితో బాధపడుతోంది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న సంపూ... ఆమెకు రూ. 10 వేలు సహాయం చేశాడు. తాను చేసిన సహాయం పెద్దది కాదని... కానీ, ఆమెకు ఎంతో కొంత భరోసాను ఇస్తుందని ఈ సందర్భంగా సంపూ తెలిపాడు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు. 

More Telugu News