తమిళనాట శశికళ పేరు లేకుండా బ్యానర్... తొలగించేందుకు వెళ్లి విఫలమైన పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళనాట శశికళ పేరు లేకుండా బ్యానర్... తొలగించేందుకు వెళ్లి విఫలమైన పోలీసులు!

తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతూ చిన్నమ్మ శశికళ పేరు, చిత్రం లేని ఓ బ్యానర్ ను తొలగించేందుకు స్వయంగా వెళ్లిన పోలీసులకు చుక్కెదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టాలంటూ, పార్టీలో పెద్ద నేతలు కోరుతున్నప్పటికీ, కార్యకర్తలు, ప్రజల్లో మాత్రం వ్యతిరేకత కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత సొంత నియోజకవర్గాల్లో ఒకటైన ఆండిపట్టిల, పన్నీర్‌ సెల్వం సర్కారుకు శుభాకాంక్షలు తెలుపుతూ శశికళ ఫోటో లేకుండా బ్యానర్ వెలిసింది.

ఈ విషయాన్ని శశికళ మద్దతుదారులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడంతో, దాన్ని తొలగించాలన్న ఉత్తర్వులు పోలీసులకు అందాయి. దీంతో స్థానిక ఇనస్పెక్టర్ ఇళంగో నేతృత్వంలో పోలీసు బృందం దాన్ని తొలగించేందుకు వెళ్లింది. అక్కడి స్థానికులు పోలీసులను అడ్డుకున్నారు. బ్యానర్ లో ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు లేవని, అమ్మ పథకాలు కొనసాగించాలని మాత్రమే ఉందని వాగ్వాదానికి దిగారు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది.

More Telugu News