డైరెక్టర్ అవ్వకముందు నుంచీ 'వంగవీటి' సినిమా తీయాలని అనుకున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన 'వంగవీటి' సినిమా ఆడియో వేడుకలో వర్మ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చేయడానికి కాలేజీకి వచ్చాను కానీ, నేర్చుకున్నది మాత్రం ఇక్కడి వాతావరణాన్ని అని అన్నారు. తన జీవిత, సినీ అనుభవం మొత్తం విజయవాడ నుంచే ప్రారంభమైందని ఆయన చెప్పారు. అప్పట్లో చోటుచేసుకున్న చాలా సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయని ఆయన తెలిపారు. అప్పట్లో తాను కూడా ఒక గ్యాంగ్ లో ఉన్నానని ఆయన వెల్లడించారు.
'వంగవీటి' అనేది తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ సబ్జెక్ట్ తో తనకున్న ఎమోషనల్ బాండింగ్ మరే సినిమాకి లేదని ఆయన తెలిపారు. సినిమా ఎలా వచ్చిందన్నది సినిమా రిలీజైన తరువాత అంతా చూస్తారని ఆయన తెలిపారు. ఈ సినిమాలో కేవలం తన అనుభవాలు మాత్రమే కాదని, స్టోరీలో పట్టు ఉండడం కూడా తానీ సినిమా తీసేందుకు కారణమైందని అన్నారు. ఇంతలో వేదిక ముందు అభిమానులు 'డైలాగ్ డైలాగ్' అంటూ అరవడంతో... డైలాగ్ కావాలా? అని 'అరవడం ఆపకపోతే ఇరగ్గొడతాను' అన్నారు. దీంతో అంతా నవ్వేశారు.
అనంతరం తన ప్రసంగం కొనసాగిస్తూ... ఈ కథ పట్ల ఒక్కొక్కరి అవగాహన ఒక్కోలా ఉంటుందని, తనకున్న అవగాహనతోనే తానీ సినిమా తీశానని ఆయన చెప్పారు. వివాదాస్పద అంశాలతో రూపొందే సినిమా అని తెలిసినా, ఏమాత్రం బ్యాలెన్స్ చేయకపోయినా ప్రమాదం ఉందని తెలిసినా నిర్మాత దాసరి కిరణ్ వెనకడుగు వేయకపోవడం విశేషం అని ఆయన కితాబునిచ్చారు. దాసరి కిరణ్ కేవలం డబ్బులు పెట్టడంతోనే తన పనైపోయిందని భావించకుండా, చాలా కష్టపడి పనిచేశాడని ఆయన అభినందించారు. కేఎల్ యూనివర్సిటీ సత్యనారాయణగారు ఈ స్థలం ఇవ్వడం విశేషమని, ఆయనకు ధన్యవాదాలు అని చెప్పారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు