ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేసే ఇండోనేషియాలో తాజాగా పలువురికి బహిరంగంగా శిక్ష వేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఓ మహిళకు బహిరంగంగా శిక్ష విధించారు. అందరి ముందు ఆమెను బెత్తంతో ఏడు సార్లు బాదారు. నొప్పి తట్టుకోలేక ఆమె కేకలు పెట్టింది. ఆమె చుట్టూ ఉన్నవారంతా ఓ సినిమా చూసినట్లు ఆమెను చూశారు. జూదం ఆడడం, మద్యం సేవించడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, స్వలింగ సంపర్కానికి పాల్పడడం వంటి చర్యలు అక్కడ నేరాలుగా పరిగణిస్తారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సదరు మహిళతో పాటు మరో మహిళ, ముగ్గురు పురుషులకు వేర్వేరు నేరాలకింద ఇదే శిక్షను అమలు చేశారు.
బందా అసె ప్రాంతంలో ఓ మసీదు వద్ద వారందరికీ ఈ శిక్షను వేశారు. చేసిన పాపాలకు దెబ్బలు తింటూ భరించలేని నొప్పితో వారందరూ విలవిల్లాడిపోయారు. ఇద్దరు కాలేజీ విద్యార్థులకు కూడా అక్కడ శిక్షలు విధించారు. పెళ్లి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకున్న నేరం కింద వారిద్దరికీ 100 చొప్పున బెత్తం దెబ్బలుపడ్డాయి. వివాహం కాకుండానే ఓ యువతితో సంబంధం పెట్టుకుని ఆమెను గర్భవతిని చేసినందుకు ఓ వ్యక్తికి 22 బెత్తం దెబ్బలు శిక్షగా విధించారు. గర్భంతో ఉన్న ఆమెకు మాత్రం ఏ శిక్ష విధించేదీ ఇంకా స్పష్టం చేయలేదు. గర్భిణులకు శిక్షల నుంచి మినహాయింపు ఉంటుంది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు