నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఓ బ్యాంకు అతికించిన నోటీసు బోర్డు పుండుమీద కారం చల్లినట్టు అయింది. పార్లమెంటు ఆవరణలో ఉన్న ఎస్బీఐలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదని, ఇది ఎంపీలకు మాత్రమేనంటూ ఓ నోటీసు బోర్డు వేలాడదీశారు. రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ఎంపీలకు ప్రైవసీ కోసమే ఇలా చేశారట. లోక్‌సభలోని 545 మంది, రాజ్యసభలోని 250 మంది ఎంపీల జీతభత్యాలతోపాటు మాజీ ఎంపీల పెన్షన్ డబ్బులు, పార్లమెంటు సిబ్బంది జీతభత్యాలు కూడా ఇక్కడే జమ అవుతాయి.
నోట్ల రద్దుతో తమ నోట్లను మార్చుకునేందుకు పార్లమెంటు సిబ్బంది బ్యాంకులో క్యూకట్టారు. అదే సమయంలో బ్యాంకుకు వచ్చిన ఎంపీలు లైను చూసి భయపడ్డారు. దీంతో వెంటనే అధికారులను కలిసి ఇది ఎంపీల కోసమే కాబట్టి ఇతరులను అనుమతించవద్దని ఆదేశించారు. ఇంకేముంది.. వెంటనే ఓ నోటీసు బోర్డు తగిలించేశారు. ఇది ఎంపీలకు మాత్రమేనని, ఇతరులను లోనికి అనుమతించబోమని అందులో పేర్కొన్నారు. దీంతో జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి అసౌకర్యాన్ని కూడా ఎంపీలు తట్టుకోలేకపోతున్నారని, బయట రోడ్లపై ప్రజలు పడుతున్న కష్టాలు వారికి కనిపించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ