టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య పోలిక సరికాదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కర్ణాటకలోని మణిపాల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ, సచిన్, కోహ్లీ ఇద్దరూ వేర్వేరు తరాలకు చెందిన వ్యక్తులని అన్నాడు. సచిన్ ముందు తరానికి చెందిన క్రికెటరైతే, ఆ తరువాత జనరేషన్‌కు చెందిన క్రికెటర్ కోహ్లీ అని గుర్తుచేశాడు. సచిన్ ఆట స్టాండర్డ్ గా ఉంటుందని, అతనిని తరచూ ఔట్ చేయడం కష్టం అనిపిస్తుందని అన్నాడు. కోహ్లీ అలా కాదని, ఒక ప్రత్యర్ధిగా అవకాశమిచ్చినట్టే కనబడి, వెంటనే దాన్ని అధిగమించగల సత్తా కోహ్లీ సొంతమని చెప్పాడు.
తానాడిన సమయంలో తానెదుర్కొన్న ప్రత్యర్ధుల్లో సచినే ఉత్తమమని గిల్ క్రిస్ట్ స్పష్టం చేశాడు. కోహ్లీ కెరీర్ ముగిసే సమయానికి సచిన్ కు దగ్గరగా చేరుకోవడం ద్వారా ప్రపంచ ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగలుగుతాడని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. సచిన్ తాను సాధించిన 34357 పరుగుల్లో పావు వంతు శాతం సెంచరీల ద్వారానే సాధించాడన్న విషయాన్ని గిల్ గుర్తుచేశాడు. ఈ మొత్తం పరుగులు రెండో స్థానంలో ఉన్న సంగక్కర చేసిన పరుగుల కంటే 6341 పరుగులు ఎక్కువని అన్నాడు. కాగా, సచిన్ మొత్తం 100 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. ఇక కోహ్లీ మొత్తం 12781 పరుగులు చేయడం విశేషం.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు