జెంటిల్మన్ గేమ్ రూపుమార్చుకోవడంపై న్యూజిలాండ్ జట్టు మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వన్డేలు, టీ20 మ్యాచ్ ల రంగప్రవేశంతో టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందని, ఈ పరిస్థితి మారాలని అంటూ గతంలో తన గొంతు వినిపించిన ఫ్లెమింగ్... ఇటీవల కాలంలో క్రికెట్ మ్యాచ్‌లు విపరీతంగా పెరిగిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. క్రికెట్ టెలివిజన్ లో 24/7 (నిరంతరం) ప్రసారమయ్యే డ్రామాగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆటకు చేటుచేస్తుందని హెచ్చరించాడు.
క్రికెట్ ఒక వినోదాత్మకమైన క్రీడ అని, దానిని ఆ స్థాయిలోనే ఉంచాలి కానీ... లెక్కకు మిక్కిలి మ్యాచ్ లు నిర్వహిస్తే కనుక గేమ్ లోని మజాను దెబ్బతీస్తుందని హెచ్చరించాడు. మరొకవైపు టీ 20 లీగ్ లు మరింత పెరగడంపై ఫ్లెమింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. డబ్బుపై ఉన్న మోజు కొద్దీ క్రికెటర్లు ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకే బాగా ఆసక్తి కనబరచడం కూడా క్రీడా స్పూర్తిని దెబ్బతీస్తుందని తెలిపాడు. ప్రస్తుతానికి దీనికి సరైన పరిష్కారం లేకపోయినా, భవిష్యత్ లో మ్యాచ్‌ల నిర్వహణను కుదిస్తే ఆటకు ప్రాధాన్యత, ఆదరణ పెరుగుతాయని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి