ప్రపంచంలో బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా... ప్రతి విషయంలోనూ తానే టాప్ గా ఉండాలని భావిస్తోంది. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో సొరంగ మార్గాన్ని నిర్మించింది. సిషువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డును టిబెట్ లోని నాగ్ కుతో కలిపే మార్గంలో ఈ సొరంగాన్ని వేసింది. షోల పర్వత ప్రధాన శిఖరాన్ని తొలిచి ఈ మార్గాన్ని నిర్మించింది. ఈ సొరంగం సముద్ర మట్టానికి 6,168 మీటర్ల ఎత్తులో 7 కిలోమీటర్ల పొడవున ఉంటుంది.
ఇప్పటిదాకా ప్రయాణికులు పర్వత రహదారుల మీదుగా 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. విపరీతమైన చలి, కొండచరియలు విరిగి పడటం, తక్కువ ఆక్సిజన్ ఉండటంలాంటి ఇబ్బందులను వారు ఎదుర్కొనేవారు. ఈ కొత్త సొరంగ మార్గంతో వారి ప్రయాణ సమయం ఇప్పుడు 2 గంటలు తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టును 2012లో మొదలు పెట్టిన చైనా... రూ. 1,139 కోట్ల వ్యయంతో సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. వచ్చే ఏడాది నుంచి ఈ మార్గంలో వాహనాలను అనుమతించనున్నారు.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి