తాజాగా స్టోన్ గ్రే కలర్ లో విడుదలైన కొత్త 500 రూపాయల నోటుకి పలు విశిష్టతలు వున్నాయి. గతంలో ఆర్బీఐ జారీచేసిన స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (ఎస్బీఎన్) సిరీస్ కు, తాజా నోటుకు చాలా వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఈ నోట్లు రంగు, పరిమాణం, డిజైన్, థీమ్, భద్రతాపరమైన ఫీచర్స్ ఇలా ప్రతి అంశంలోనూ చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుని సరికొత్త 500 రూపాయల నోటును తీర్చిదిద్దారు.
ఈ నోటు వివరాల్లోకి వెళ్తే...
* మహాత్మాగాంధీ సిరీస్ లో విడుదల చేసిన కొత్త 500 రూపాయల నోట్లపై ‘E’ అనే ఇంగ్లిష్ అక్షరంతోపాటు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, ముద్రణ సంవత్సరం ‘2016’, స్వచ్ఛ భారత్ లోగో, నోటు వెనుకవైపున ముద్రించి ఉంటాయి.
* ఈ నోటు వెడల్పు 0.66 మిల్లీమీటర్ల మందం, 150 మిల్లీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి.
* 500 నోటు రంగు స్టోన్ గ్రే (నెరిసిన ముదురు రంగు)
* భారత వారసత్వ సంపద అయిన జాతీయ పతాకంతో కూడిన ఎర్రకోట బొమ్మ నోటు వెనుకవైపున ముద్రించి ఉంటుంది.
అంధుల కోసం
* మహాత్మాగాంధీ బొమ్మ.
* అశోక చిహ్నం.
* బ్లీడ్ లైన్స్.
* ఐడెంటిఫికేషన్ మార్క్స్ లను ఉబ్బెత్తుగా ముద్రించారు.
దీంతో వీటికి నకిలీలు తయారు చేయడం కష్టమని ఆర్బీఐ అభిప్రాయపడింది.