తమ తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఏవోబీకి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీలోని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు మృతి చెందిన విషయం విదితమే. మావోయిస్టులకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చి, వారు మత్తులోకి జారుకున్నాక పోలీసులు కాల్పులు జరిపారని పౌరహక్కుల నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో అసలు ఏమి జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు నాలుగు రోజుల క్రితం నిజనిర్థారణ కమిటీ ఒకటి అక్కడికి వెళ్లింది. ఈ కమిటీలో విద్యార్థులు కూడా ఉన్నారు.
అక్కడికి వెళ్లిన ఈ కమిటీ కీలక ఆధారాలను సేకరించింది. కమిటీ పర్యటన, సభ్యుల వివరాలను ఏపీ, ఒడిశా డీజీపీలకు ముందే చెప్పామని, అయినప్పటికీ, తమకు చెప్పలేదంటూ విశాఖపట్టణం ఎస్పీ అంటున్నారన్నారు. ఈ విషయమై తమ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని కమిటీలోని విద్యార్థులు వాపోయారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో సేకరించిన వివరాలను హైదరాబాద్ లో వెల్లడిస్తామని ఆ కమిటీ పేర్కొంది. కాగా, ఏవోబీలో మావోల కోసం పోలీసులు మాటు వేసిన ప్రాంతంలో మద్యం సీసాలు, కండోమ్ లు ఉండడాన్ని గుర్తించినట్లు నిజ నిర్థారణ కమిటీ పేర్కొంది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి