దేశంలో పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారులు
రూ.500, 1000 నోట్లు తీసుకోవడం లేదన్న విషయం తెలిసిందే. అయితే సామాన్యులు ఇబ్బందులు పడకుండా ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లతో పాటు పలు ప్రాంతాల్లో 72 గంటల వరకు అవి చలామణిలో ఉంటాయని కూడా కేంద్రం చెప్పింది. రైల్వేస్టేషన్లలో నోట్లు చలామణిలో ఉంటాయని, కేంద్ర పేర్కొంది కానీ, మెట్రో రైల్వేస్టేషన్ల గురించి ఏ ప్రకటనా చేయలేదు. దీంతో ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఈ రోజు గందరగోళం నెలకొంది.
మెట్రో రైల్వేస్టేషన్లలో పెద్ద నోట్లు చెల్లవని ఈరోజు ఉదయం అధికారులు పేర్కొన్నారు. దీంతో మెట్రో ద్వారా ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎన్నో కష్టాలు పడ్డారు. సమాచారం అందకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతాదాస్ ప్రయాణికుల ఇక్కట్ల గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెప్పారు. దీంతో రానున్న 72 గంటల వరకు మెట్రో స్టేషన్లలో 500, 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉంటాయని ప్రకటన వచ్చింది.
More Telugu News
-
60 అడుగల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి