విజయవాడ రైల్వేస్టేషన్... నిత్యమూ లక్షమందిని తమతమ గమ్యస్థానాలకు చేరుస్తూ బిజీగా ఉంటుంది. ఈ ఉదయం రైల్వే స్టేషన్ లో కొత్త సమస్య ఎదురైంది. అదే చిల్లర అవస్థ. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవన్న నిర్ణయం నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే కౌంటర్లలో ఈ నోట్లను తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఓ యాభై లేదా వంద రూపాయల టికెట్ ఖరీదు చేస్తే, ఇవ్వాల్సిన మిగతా చిల్లర తమ వద్ద లేదని, చిల్లర ఇస్తేనే టికెట్ ఇస్తామని కౌంటర్లలోని సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి.
బయటకు వెళితే, ఏ ఒక్కరూ ఆ నోట్లను తీసుకునేందుకు సిద్ధంగా లేరు. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ లో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో, అధికారులు స్పందించి కౌంటర్ల సిబ్బందికి వంద రూపాయల బండిల్స్ కొన్ని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎంతో మంది క్యూలో నిలబడి, వరంగల్ కు రూ. 90 పెట్టి టికెట్ కొని రూ. 400 చిల్లర తీసుకుని ఆ టికెట్ చించి పడేసి తిరిగి క్యూలోకి వెళ్లి 400 రూపాయల చిల్లర కోసం మరో టికెట్ కొంటున్న పరిస్థితి. బయటకు వెళితే 500 రూపాయల నోట్లను ఎవరూ తీసుకోవడం లేదని, అందువల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఒక్క విజయవాడలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు