మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి అందుకు భార్య అంగీకరించని కారణంగా ఆమెను హత్యచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మీడియాకు వివరాలు వెల్లడించారు. బోత్రా గ్రామానికి చెందిన కునాల్సోనక్ ఖడ్కేకు భార్య ఇందు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, అయితే తనకు కొడుకు కావాలని కునాల్ మరో మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని పోలీసులు తెలిపారు. తన భర్త రెండో పెళ్లికి ఆమె ఒప్పుకోకపోవడంతో తన భార్యను హతమార్చాలనుకున్న నిందితుడు నిన్న రాత్రి ఆమెను గ్రామ శివారులోని నది వద్దకు బండిమీద తీసుకెళ్లి, గొంతు నులిమి హత్యచేశాడని పేర్కొన్నారు.
తదుపరి తన భార్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడని పోలీసులు అన్నారు. అయితే, ఇందు తండ్రికి తన అల్లుడు కునాల్సోనక్ మీద అనుమానం రావడంతో ఫిర్యాదు చేశాడని, దీంతో తమ దర్యాప్తులో కునాల్ తన భార్యను హతమార్చినట్లు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి