ఢిల్లీని కమ్మేసినటువంటి పొగమంచు మేఘాలను గతంలో ఎన్నడూ చూడలేదని, భారత రాజధానిలో ఇంతటి ఘోర పరిస్థితి ఇదే తొలిసారని కాలుష్యంపై విదేశీ మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీని విషపూరితమైన మేఘాలు కమ్మేసి వారం దాటగా, ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించి, ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరిన సంగతి తెలిసిందే. పలు క్రికెట్ మ్యాచ్ లు రద్దు కాగా, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ పరిస్థితి రావడానికి స్వీయాపరాధాలే కారణమంటూ, దీపావళి టపాసులు పేల్చడం, పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీ యూఎస్ ఎంబసీలోని ఎయిర్ మానిటర్ అందించిన వివరాల ప్రకారం, 2.5 పీఎంగా మాత్రమే ఎయిర్ క్వాలిటీ ఉందని, పర్యావరణ శాఖ ఆమోదించే స్థాయితో పోలిస్తే ఇది ఆరు రెట్లు తక్కువని పేర్కొంది. ఈ గాలి పీలిస్తే ఎన్నో రోగాలు వస్తాయని హెచ్చరించింది. ప్రపంచంలోనే అత్యధికులు నివసించే 11వ నగరంగా గుర్తింపు పొందిన ఢిల్లీలో వాతావరణం ఇంత భయంకరంగా మారడానికి కారణం మీరంటే మీరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నాయని 'వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు