గత నెల 24వ తేదీన టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి సైరస్ మిస్త్రీని తప్పించిన నేపథ్యంలో యూకే - ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల ఫోరమ్ నుంచి కూడా ఆయన్ను తొలగించారు. మిస్త్రీ స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అజయ్ పిరామల్ ను కేంద్రం నియమించింది. యూకే, ఇండియాల మధ్య వాణిజ్య బంధం బలోపేతం చేసేందుకు ఈ ఫోరమ్ కృషి చేస్తుంటుంది. ఇక దీనికి చీఫ్ గా సైరస్ మిస్త్రీ కొనసాగుతున్నారు. అయితే, టాటా సన్స్ నుంచి మిస్త్రీని తొలగించిన నేపథ్యంలో, సీఈఓ ఫోరమ్ కు కొత్త చీఫ్ ఎంపిక వార్తలు, కొత్త వివాదానికి, మీడియాలో చర్చకు దారితీస్తాయని భావించిన మోదీ సర్కారు ఈ నియామకాన్ని రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.
ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు బ్రిటన్ ప్రధాని థెరిస్సామే ఇండియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇండియా - యూకే సీఈఓల ఫోరం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో అజయ్ పిరామల్ పేరును బయట పెట్టక తప్పలేదు. ఈ సీఈఓ ఫోరమ్ సమావేశం బాధ్యతలను పిరామల్ స్వయంగా పర్యవేక్షిస్తుండగా, మీడియాకు లీకులు తప్ప, అధికారికంగా ఆయన పేరును ఇంకా ప్రకటించలేదు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ