మధ్యప్రదేశ్ రాట్లాం జిల్లాలోని ఓ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి తమ స్కూల్ డైరెక్టర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాల పాలయిన స్కూల్ డైరెక్టర్ అమిత్ జైన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళితే నిందితుడయిన విద్యార్థి స్కూల్ యూనిఫాంలో కాకుండా మామూలు దుస్తుల్లో స్కూలుకి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు సదరు విద్యార్థిని హెచ్చరించి మళ్లీ ఇంటికి వెళ్లి స్కూల్ యూనిఫాం వేసుకుని పాఠశాలకు రమ్మన్నారు.
అనంతరం పాఠశాల సిబ్బంది ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడిపై ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పాఠశాలకు రావడం లేదని, అతడి బిహేవియర్ కూడా బాగోలేదని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థి యూనిఫామ్ ధరించి తిరిగి పాఠశాలకు వెళ్లాడు. అయితే, తనతో ఓ తుపాకీ కూడా తెచ్చుకొని స్కూల్లో అడుగుపెడుతూనే జైన్ పై కాల్పులు జరిపాడు. విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అతడి వద్దకు తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరుపుతున్నారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి