ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెలపై కుంపటిలా భావిస్తుంటారు కొందరు. కొడుకు కన్నా కూతురే మిన్న అని ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఆడపిల్లలను తల్లికడుపులోంచి రానివ్వకుండా కడుపులోనే చంపేసే ప్రయత్నాలు చేస్తుంటారు. మగపిల్లాడు పుట్టడానికైనా, ఆడపిల్ల పుట్టడానికైనా పురుషుడే కారణమని డాక్టర్లు చెబుతున్నా ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోడలిని చిత్రహింసలు పెడుతుంటారు కొందరు అత్తలు. ఉత్తరప్రదేశ్‌లోని హమిర్పుర్ జిల్లాలో మాత్రం ఓ అత్త మంచి పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆడపిల్లను కన్నదని తెలిసి తన కోడలికి పెద్ద గిఫ్టు ఇచ్చింది.
తన కోడలు కుష్భూ ఆడపిల్లకు జన్మనిచ్చిందని తెలుసుకున్న ప్రేమాదేవి అనే ఓ అత్త ఎంతగానో హర్షం వ్యక్తం చేసింది. తన పేరుకు తగ్గట్లుగానే ప్రవర్తించి తన మనవరాలిపై ఎంతో ప్రేమను కురిపించింది. వెంటనే ఓ కారును తన కోడలకి బహూకరిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, బంధుమిత్రులను ఇంటికి పిలిచి ఫంక్షన్ కూడా చేసింది. తమ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అంబరమంత ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రేమాదేవి ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైరయ్యారు. తన కోడలికి హోండా సిటీ కారును గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు ప్రకటించింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు