దేశ ఐక్యతను దెబ్బతీసే విషయాల పట్ల జాగ్రత్త వహించాలి: ఢిల్లీలో ప్రధాని మోదీ
దేశ ఐక్యతను దెబ్బతీసే విషయాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచించారు. ఢిల్లీలోని ధ్యాన్ చంద్ మైదానంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ యువకులతో 'రన్ ఫర్ యూనిటీ'ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యువతతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం మరింత ఉందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోసం ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. ఐక్యత కోసం అందరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ జీవితాన్ని తెలియజేసే డిజిటల్ మ్యూజియంను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.