దిశ మార్చుకున్న తుపాను.. కోస్తాకు వర్ష సూచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దిశ మార్చుకున్న తుపాను.. కోస్తాకు వర్ష సూచన

కయాంత్ తుపాను తేలిపోయింది. రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రల ప్రజలను ఆందోళనకు గురిచేసిన తుపాను నెమ్మదించింది. దిశమార్చుకున్న ఈ తుపాను దక్షణ బంగాళా ఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది చెన్నై దిశగా కదులుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తుపాను తమిళనాడు కేంద్రంగా సాగనుందని, దీని ప్రభావం ఆ రాష్ట్రం మీదే అధికంగా ఉంటుందని వారు వెల్లడించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు.

More Telugu News