ఎన్ కౌంటర్ లో ఆర్కేను చంపేశారని, కాదు బతికున్నారని.. ఇలా రకరకాలుగా చెబుతున్నారని ఆయన భార్య పద్మక్క అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆర్కే ఉన్నారని.. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చుట్టుముట్టి చంపారని, విషప్రయోగం జరిగిందని రకరకాలుగా చెబుతున్నారు. ఈ విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ఆర్కే అక్కడ ఉన్నారని ఎన్ కౌంటర్ చేశారేమో కానీ, ఆయన బాడీ గార్డ్స్, అక్కడి ప్రజలే ఆర్కేను కాపాడుకున్నారు’ అని అన్నారు.
ఆర్కే ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేని స్థితిలో ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం ఉందనే ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ, ‘ఆయన్ని పట్టుకుని మరింత టార్చర్ పెట్టాలని పోలీసులు చూస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న ఆయనకు వైద్యం చేయిస్తామని చెబుతున్న పోలీసుల మాటలు ఎలా నమ్ముతాం? నేనైతే నమ్మను’ అని అన్నారు.
‘మున్నా తన తండ్రి ఆర్కేను చూసేందుకే చిన్నవయస్సులోనే ఉద్యమంలోకి వెళ్లాడంటున్నారు. అసలు, తన తండ్రిని మున్నా చూశాడా?’ అనే ప్రశ్నకు మున్నా తల్లి పద్మక్క సమాధానమిస్తూ.. "అవును, వాళ్ల నాన్నను చూసేందుకే వెళ్లాడు. ఆ తర్వాత, ప్రజల బాధలు, పరిస్థితులు, గ్రామాల్లో విచక్షణా రహితంగా జరుగుతున్న దాడులను మున్నా తన కళ్లారా చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఉద్యమంలో ఉండిపోవాలని మున్నా నిర్ణయించుకున్నాడు’ అని చెప్పారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు