కృష్ణా నదీ నీటి పంపకాల తీర్పుపై మంత్రివర్గ ఉపసంఘం వేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. కృష్ణా నదీ నీటి పంపకాలపై ఇటీవలే బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలో మంత్రుల అభిప్రాయాన్ని తీసుకున్నారు. నాలుగు వారాల్లో కృష్ణా నదీ నీటి పంపకాల తీర్పుపై అభ్యంతరాలు ఉంటే తమకు తెలపాలని ట్రైబ్యునల్ సూచించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాము ముందుకెళ్లాల్సిన అంశంపై ఉపసంఘం ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.