ప్రియుడు సత్యవర్త్‌ తో ఒలింపిక్స్‌ విజేత సాక్షిమాలిక్‌ ఎంగేజ్ మెంట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడు సత్యవర్త్‌ తో ఒలింపిక్స్‌ విజేత సాక్షిమాలిక్‌ ఎంగేజ్ మెంట్!

రియో ఒలింపిక్స్‌ పతక విజేత రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ కు హర్యాణాలోని రొహ్ తక్‌ నగరానికే చెందిన ప్రియుడు, రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌ తో నిశ్చితార్థం జరిగింది. ఒలింపిక్ పతకం గెలిచిన అనంతరం తన ప్రేమ సంగతిని సాక్షి మాలిక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం ఈ జంటకి నిశ్చితార్థమైంది. ఈ మేరకు తమ రెండు కుటుంబాలకు చెందిన సభ్యుల సమక్షంలో జరిగిన నిశ్చితార్థ వేడుక చాలా బాగా జరిగిందని సత్యవర్త్‌ తండ్రి సత్యవాన్‌ వెల్లడించారు. సత్యవర్త్‌ 2014లో గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం, ఇంచియాన్‌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచి సత్తాచాటాడు. భారీకాయుడైన సత్యవర్త్ 97 కేజీల విభాగంలో పోటీపడుతుంటాడు. వాస్తవానికి రియో ఒలింపిక్స్‌ కు ముందే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఒలింపిక్స్ సన్నాహాల్లో లోపం ఉండకూడదని వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో సాక్షి మాలిక్‌ రియోలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, 24 ఏళ్ల సాక్షి మాలిక్‌ కన్నా సత్యవర్త్‌ రెండేళ్లు చిన్నవాడు.

More Telugu News