ఓ పెళ్లయిన అమ్మాయిని పటాయించా... కానీ..!: స్నేహితులతో ట్రంప్ సంభాషణ ఆడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ పెళ్లయిన అమ్మాయిని పటాయించా... కానీ..!: స్నేహితులతో ట్రంప్ సంభాషణ ఆడియో

రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ ను మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. గతంలో ఆయన శృంగారం, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలు, వారితో తన ప్రవర్తనకు సంబంధించిన ఒక్కొక్క వీడియో, ఆడియో టేపులు బయటకు వస్తుంటే, సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో అధ్యక్ష పీఠానికి ఒక్కో మెట్టూ దూరమవుతున్నారు ట్రంప్. తాజాగా, ఓ వ్యానులో తన స్నేహితులతో పాటు వస్తూ, తాను చేసిన ఓ నిర్వాకాన్ని గురించి ట్రంప్ స్వయంగా చెప్పగా, అది మైక్రోఫోన్ లో రికార్డు అయి, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియరాలేదుగానీ, అందులో ట్రంప్ నోటి దురుసుతనం స్పష్టంగా తెలుస్తోంది. చుట్టూ వున్న స్నేహితులు పకపకా నవ్వుతుంటే, తాను ఓ వివాహితను ఫర్నీచర్ షాపులో పటాయించానని, బయటకు కూడా తీసుకెళ్లానని, కానీ ఆ ప్రయత్నం వేస్ట్ అయిందని చెప్పుకొచ్చారు. ఆమె శరీర సౌష్టవాలను, అందాన్ని వర్ణించారు. వదిలేసినందుకు బాధగా ఉందన్నారు. ఈ ఆడియో బయటకు పొక్కిన తరువాత, ఆయన నోటి దురుసుకు భారీ మూల్యం తప్పదని పలువురు మరోసారి విమర్శలు గుప్పించారు.

More Telugu News