జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ దిశాకు చేదు అనుభవం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ కు వచ్చిన హీరోయిన్ దిశాకు చేదు అనుభవం

'లోఫర్' సినిమా హీరోయిన్ అయిన దిశా పటానికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాదులో ఓ జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ కు వచ్చిన ఆమె ఊహించని పరిణామం ఎదుర్కొంది. వివరాల్లోకి వెళ్తే, స్టోర్ ప్రారంభోత్సవానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే దిశా వచ్చింది. ఈ నేపథ్యంలో, దిశాను చూడగానే అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. సెక్యూరిటీ లేకపోవడంతో, వారిని నిలువరించడం కష్టమైంది. ఇంతలో, కొందరు అల్లరి మూకలు ఆమె చేయి లాగి ఇబ్బందికరంగా ప్రవర్తించారు. దీంతో, దిశా పటాని షాక్ కు గురైంది. అంతేకాదు, ఆమె చేతికి స్పల్పంగా గాయమైనట్టు సమాచారం. అనంతరం, నిర్వాహకుల సహకారంతో అక్కడ నుంచి ముందుకు కదిలి, తనను చూసేందుకు వచ్చిన వారికి అభివాదం చేస్తూ ఆమె స్టోర్ లోకి వెళ్లిపోయింది.

More Telugu News