Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. శాస్త్రోక్తంగా కార్యాలయంలోకి అడుగిడిన ముఖ్యమంత్రి!

ఇక నుంచి అమరావతి కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కార్యకలాపాలు కొనసాగనున్నాయి. వెలగపూడిలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)ను చంద్రబాబు ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన 8:09 గంటల ముహూర్తానికి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుమ్మడికాయ కొట్టి చాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, సీఎస్ టక్కర్, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

More Telugu News