ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల హడావుడి పెరుగుతోంది. జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్ర పార్టీలైన సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలు మాత్రం ఎలాంటి ర్యాలీలు చేపట్టకుండా నెమ్మదిగా ప్రచార వేగం పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ ఈనెల 9న పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతిని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల నుంచి లక్ష మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 18 రైళ్లను బుక్ చేశారు.
ఈ 18 రైళ్లలో 16 రైళ్లను పశ్చిమ యూపీ నుంచి, మరో రెండు రైళ్లను బలియా జిల్లా నుంచి నడపనున్నారు. ప్రతి రైలులో 5 వేల మంది వాలంటీర్లు ఈ నెల 8న లక్నో చేరుకోనున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల నుంచి పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు బస్సుల్లో కార్యకర్తలను తీసుకుని ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. 9వ తేదీన నిర్వహించనున్న ర్యాలీలో సుమారు 20 లక్షల మంది కార్యకర్తలను సమీకరించాలన్నది పార్టీ లక్ష్యమని పార్టీ నేత ఒకరు చెప్పారు. తద్వారా పార్టీ బలాన్ని ఇతర పార్టీలకు చాటాలన్నది మాయావతి వ్యూహమని ఆయన వెల్లడించారు.
ఇందులో పాల్గొనేందుకు చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారికి ప్రయాణ సౌకర్యాలు సమకూర్చడం తమ వల్ల కావడం లేదని ఆయన అన్నారు. కాగా, మాయావతి ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఆగ్రా, ఆజాంగఢ్, సహారన్ పూర్, అలహాబాద్ ప్రాంతాల్లోని 220 నియోజకవర్గాలను చుట్టేయడం ద్వారా, ర్యాలీలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ప్రధానంగా ఆమె దళితులు, ముస్లింలు, బ్రాహ్మణుల ఓటు బ్యాంకుపై కన్నేశారని పరిశీలకులు చెబుతున్నారు. అదే సమయంలో మిగిలిన వర్గాలను నిర్లక్ష్యం చేయకూడదన్నది మాయావతి ఉద్దేశ్యమని వారు చెబుతున్నారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ