పాక్ లోని మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ లోని మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి

పాకిస్థాన్‌లో మ‌రోసారి ఆత్మాహుతి దాడి జ‌రిగింది. పెషావ‌ర్ ప్రాంతంలోని మ‌హ‌మాండ్ ఏజెన్సీలో మ‌సీదులో శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు జ‌రుపుతున్న‌ ముస్లింలే ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు ఈ దాడి చేశారు. ఈ ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందారు. మ‌రో 30 మందికి పైగా ప్ర‌జ‌లు గాయ‌ప‌డ్డారు. మ‌సీదు ద‌గ్గ‌ర‌కు చేరుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. దాడికి పాల్ప‌డింది తామేన‌ని ఇంత‌వ‌ర‌కు ఏ ఉగ్ర‌వాద సంస్థ ప్ర‌క‌టించ‌లేదు.

More Telugu News