Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్న మామయ్యకు బర్త్ డే శుభాకాంక్షలంటూ అరుదైన ఫొటోను పోస్ట్ చేసిన సుమంత్

ఈరోజు హీరో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన మేనల్లుడు, కథానాయకుడు సుమంత్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. చిన్నమామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలని, నాగార్జున ఎప్పటికీ యువకుడిలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఇంకా మీసాలు కూడా రానప్పటి నాగార్జున, చిన్న పిల్లాడిగా వున్న తనను ఎత్తుకుని ఉన్న ఒక ఫొటోతో పాటు.. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఉన్న తాజా ఫొటోను కూడా సుమంత్ పోస్ట్ చేశాడు.

More Telugu News