Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిర్దయ భారతావనికి నిదర్శనం, దేశాకృతిలో భార్య మృతదేహాన్ని మోసుకు వెళుతున్న వ్యక్తి దృశ్యం వైరల్... మీరూ చూడండి!

అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నామని చెప్పుకునే భారతావనిలో పేదలు ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో, ప్రజలు ఎంత నిర్దయగా వ్యవహరిస్తున్నారో తెలియజేస్తున్న ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఒడిశాలోని ఓ ఆసుపత్రిలో తన భార్య మరణిస్తే, మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులేని స్థితిలో శవాన్ని భుజంపై వేసుకుని పది కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే వ్యక్తి చిత్రాన్ని ఓ చిత్రకారుడు భారతదేశాకృతిలో చిత్రీకరించి తన ఆవేదన తెలియజేశాడు. ఇప్పుడు ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, మనల్ని మనమే ప్రశ్నించుకుంటున్న వైనాన్ని కలిగిస్తోంది. ఆ చిత్రం ఇదే!

More Telugu News