ఇక వైసీపీ వంతు!... ఏపీకి ప్రత్యేక హోదా కోసం లోక్ సభలో జగన్ పార్టీ వాయిదా తీర్మానం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక వైసీపీ వంతు!... ఏపీకి ప్రత్యేక హోదా కోసం లోక్ సభలో జగన్ పార్టీ వాయిదా తీర్మానం!

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ నిన్నటిదాకా రాజ్యసభను కదిపేస్తే... తాజాగా పార్లమెంటులో దిగువ సభ లోక్ సభలోనూ ఈ అంశం పెను చర్చకు దారితీసేలానే ఉంది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్ సభలో ప్లకార్డులు చేతబట్టి నిరసనలతో హోరెత్తించారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ ఎంపీలు సభలో గందరగోళానికి కారణమయ్యారు. ఈ తరుణంలో ఏపీలో విపక్షం వైసీపీ కూడా రంగంలోకి దిగింది. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలంటూ ఆ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు.

More Telugu News