కాంట్రాక్టర్ ను క్యాంపు ఆఫీస్ కు పిలిపించిన చంద్రబాబు!... చేత కాకపోతే తప్పుకోవాలని ఆగ్రహం!
ఏపీలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న ఓ కాంట్రాక్టర్ ను ఏకంగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. పుష్కర పనులకు సంబంధించి విజయవాడలోని సీతానగరం ఘాట్ పనులను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ సీఎంఓ అధికారుల పిలుపుతో అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటికే పుష్కర పనులపై పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు... సదరు కాంట్రాక్టర్ ను చూడగానే ఆగ్రహోదగ్రులయ్యారు. ‘‘ఎంతో నమ్మకంతో పనులు అప్పగిస్తే ఇలా చేస్తావా? చేతకాకపోతే తప్పుకో. వేరే వాళ్లు ఆ పనిని చేపడతారు. ఇలా చేసినందుకు నీపై చర్య తీసుకుంటాను’’ అని చంద్రబాబు హూంకరించడంతో ఆ కాంట్రాక్టర్ వణికిపోయాడట.