హైదరాబాదులో అక్రమ హోర్డింగులపై కేటీఆర్ ఆగ్రహం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తోన్న భారీ వర్షాలకు అక్రమ హోర్డింగులు కూలి ప్రమాదాలకు కారణమవుతోన్న అంశంపై తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ హోర్డింగ్లు, బ్యానర్లను వెంటనే తొలగించాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నేతల జన్మదినాల సందర్భంగా కూడా హోర్డింగ్లు అనుమతించవద్దని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు.