బీహార్ సీఎం నితీశ్ నియోజకవర్గంలో పాకిస్థాన్ జెండా ఎగురవేత... అలజడి
బీహార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ఘటన బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సొంత నియోజకవర్గమైన నలంద జిల్లాలో జరగడం గమనార్హం. అక్కడి ఖరాది మొహల్లా ప్రాంతంలో దుండగులు చేసిన ఈ చర్య స్థానికంగా అలజడి రేపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పాక్ జెండాను తొలగించారు. ఈ చర్యకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పాక్ జెండాను ఎగురవేయడం పట్ల ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను వెంటనే పట్టుకొని, శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.