భార్య, మామలను నరికేసిన కసాయి!... అత్త, బావమరిదిపైనా కత్తితో దాడి చేసిన వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్య, మామలను నరికేసిన కసాయి!... అత్త, బావమరిదిపైనా కత్తితో దాడి చేసిన వైనం!

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త కత్తిచేతబట్టి భార్య సహా మామ, అత్త, బావమరిదిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో భార్య, మామ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బావమరిదికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళితే... పుట్టింటికి చేరిన భార్యపై కోపంతో ఊగిపోయిన సుబ్రహ్మణం నిన్న రాత్రి కత్తి చేతబట్టుకుని దాడికి దిగాడు. భార్య విజయతో పాటు మామ వెంకటేశ్వరరావులను నరికేశాడు. రెప్పపాటులో జరిగిన ఈ దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ దాడిని అడ్డుకోబోయిన తన బావమరిది శివరామకృష్ణ, అత్తపైనా సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. శివరామకృష్ణకు తీవ్ర గాయాలు కాగా అతడి తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. దాడి అనంతరం సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో అతడిని ఆపేందుకు యత్నించిన బంధువు వెంకటేశ్వరరావుపైనా అతడు దాడికి దిగాడు. ఈ దాడిలో వెంకటేశ్వరరావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించిన పొరుగు గ్రామం పర్వతపురం గ్రామస్తులు ఎట్టకేలకు అతడిని నిలువరించి పోలీసులకు పట్టించారు.

More Telugu News