ఢిల్లీకి చెందిన వర్ధమాన మోడల్ ఆత్మహత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీకి చెందిన వర్ధమాన మోడల్ ఆత్మహత్య

ఢిల్లీకి చెందిన వర్ధమాన మోడల్ కరమ్ జీత్ కౌర్ (25) ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. రంజాన్ పండగ ముందు రోజు ఆమె ముంబయికి వచ్చింది. అంధేరి ప్రాంతంలోని ఒక ఫ్లాట్ లో ఆమె తన స్నేహితుడితో కలిసి ఉంటోంది. నిన్న రాత్రి ఆమె స్నేహితుడు ఫ్లాట్ కి తిరిగి వచ్చేసరికి లోపలి వైపు తలుపు తాళం వేసి ఉంది. దీంతో, అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారమందించాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గదిలో ఫ్యాన్ కి వేలాడుతున్న కరమ్ జీత్ మృతదేహం కనిపించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News