జకీర్ తల తెగ నరికితే... రూ.50 లక్షలు!: సాధ్వీ ప్రాచీ సంచలన ప్రకటన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జకీర్ తల తెగ నరికితే... రూ.50 లక్షలు!: సాధ్వీ ప్రాచీ సంచలన ప్రకటన!

ఇస్లామిక్ మత బోధనల పేరిట ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లేలా చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ కు సంబంధించి సంచలన ప్రకటనలు వెలువడుతున్నాయి. జకీర్ ను చంపేస్తే రూ.15 లక్షలిస్తామని షియా గ్రూపునకు చెందిన ‘హుస్సేనీ టైగర్స్’ నిన్న ప్రకటించగా... విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) మాజీ నేత సాధ్వీ ప్రాచీ ఆ ధరను మరింతగా పెంచేశారు. జకీర్ నాయర్ తలను తెగ్గోసిన వారికి తాను రూ.50 లక్షలు బహుమానంగా ఇస్తానని ఆమె నిన్న ఉత్తరాఖండ్ లోని రూర్కీలో ప్రకటించారు. జకీర్ ఇస్తామిక్ మత గురువు కాదన్న ప్రాచీ... ఆయననను ఉగ్రవాదిగా అభివర్ణించారు. జకీర్ ను చంపేసే వారికి ఇచ్చే బహుమానాన్ని తాను సొంతంగానే ఇస్తానని, ఏ ఒక్క సంస్థ సహకారం తీసుకోనని కూడా ఆమె ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ప్రకటన విడుదలైన వెంటనే సాధ్వీ ప్రాచీకి బెదిరింపులు ఎదురయ్యాయి. సాధ్వీకి ఫోన్ చేసిన ఓ యువకుడు తనను తాను షాహిద్ గా పరిచయం చేసుకుని, ఆమెను కిడ్నాప్ చేస్తానంటూ బెదిరించాడట. ఈ మేరకు ఈ బెదిరింపులపై సాధ్వీ మరికాసేపట్లో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

More Telugu News